Andhra Pradesh: దేశంలో కరోనా అత్యధికంగా ఉన్న జిల్లాల జాబితాలో ఐదు ఏపీ జిల్లాలు!

  • దేశంలో 30 జిల్లాల్లో కరోనా ఉద్ధృతం
  • తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, బెంగాల్ లో అధిక కేసులు
  • దేశంలో ఇప్పటివరకు 76 లక్షల కేసులు
Five districts of AP gets place in top corona hotspots list

భారత్ లో ఇప్పటివరకు 76 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, 67 లక్షల మంది కోలుకున్నారు. మొత్తం 1.15 లక్షల మంది కరోనా కారణంగా మరణించారు. ఈ నేపథ్యంలో కేంద్రం దేశంలో కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉన్న జిల్లాల జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో ఏపీకి చెందిన ఐదు జిల్లాలు ఉన్నాయి. దేశంలో మొత్తం 30 జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏపీలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఈ రాకాసి వైరస్ కోరలు చాస్తోందని గుర్తించారు.

మొత్తం 30 జిల్లాల జాబితా ఇదే...

  • తూర్పు గోదావరి
  • పశ్చిమ గోదావరి
  • గుంటూరు
  • ప్రకాశం
  • చిత్తూరు
  • చెన్నై
  • తిరువళ్లూరు
  • కోయంబత్తూరు
  • చెంగల్పట్టు
  • సేలం
  • పుణే
  • నాగ్ పూర్
  • ఠాణే
  • అహ్మద్ నగర్
  • ముంబయి
  • తుముకూరు
  • మైసూర్
  • బెంగళూరు అర్బన్
  • దక్షిణ కన్నడ
  • హసన్
  • 24 ఉత్తర పరగణాలు
  • 24 దక్షిణ పరగణాలు
  • హుగ్లీ
  • హౌరా
  • కోల్ కతా
  • త్రిసూర్
  • తిరువనంతపురం
  • కోజికోడ్
  • ఎర్నాకుళం
  • మళప్పురం

More Telugu News