ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడ్ని నియమించడంపై అంబటి సెటైర్

20-10-2020 Tue 21:06
  • టీడీపీలో మార్పులు చేర్పులు చేసిన చంద్రబాబు
  • అచ్చెన్నాయుడికి కీలక బాధ్యతలు
  • మునిగిపోతున్న పడవలో 'పెద్ద' మనిషి అంటూ అంబటి వ్యాఖ్యలు
YSRCP MLA satires in Atchennaidu appointment as AP TDP President

టీడీపీకి నూతన జవసత్వాలు కలిగించే దిశగా అధినేత చంద్రబాబునాయుడు విస్తృతస్థాయిలో మార్పులు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడికి బాధ్యతలు అప్పగించారు. అచ్చెన్నాయుడు కూడా తన నియామకం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆయన కుటుంబంలోనూ హర్షం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. "అసలే మునిగిపోతున్న పడవ... అచ్చెన్నాయుడు వంటి 'పెద్ద' మనిషిని ఎక్కించారు... ఇక దరిచేరదీనావ!" అంటూ ఎద్దేవా చేశారు.