థాంక్యూ గాడ్... మరో బిడ్డ పుట్టిన ఆనందంలో హీరో కార్తి ట్వీట్

20-10-2020 Tue 20:43
  • కార్తి దంపతులకు మగబిడ్డ
  • తమ జీవితాలను మార్చే అనుభూతి అంటూ కార్తి వ్యాఖ్యలు
  • తన బిడ్డకు అందరి ఆశీస్సులు కావాలన్న కార్తి
Hero Karthi blessed with a baby boy

తమిళ హీరో కార్తి మరోసారి తండ్రయ్యారు. కార్తి దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని కార్తి స్వయంగా వెల్లడించారు. తమ జీవితాలను మార్చే ఈ అనుభూతిని అందించిన డాక్టర్లు, నర్సులకు కేవలం కృతజ్ఞతలు చెప్పి సరిపెట్టుకోలేమని కార్తి ట్వీట్ చేశారు.  మా చిన్నారికి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరారు. థాంక్యూ గాడ్ అంటూ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

తమిళ సీనియర్ నటుడు శివకుమార్ రెండో కుమారుడే కార్తి. కార్తి వివాహం 2011లో రజని చిన్నస్వామితో జరిగింది. కార్తి, రజని దంపతులకు ఇప్పటికే ఉమయాళ్ అనే కుమార్తె ఉంది. తాజాగా మరో బిడ్డ జన్మించడంతో కార్తికి సోషల్ మీడియాలో ప్రముఖుల నుంచి అభినందనలు అందుతున్నాయి.