ఏపీ కరోనా అప్ డేట్స్: 3,503 పాజిటివ్ కేసులు, 28 మరణాలు

20-10-2020 Tue 19:33
  • అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 524 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 48 మందికి పాజిటివ్
  • తాజాగా 5,144 మందికి కరోనా నయం
AP Corona Virus statistics and details

ఏపీలో గడచిన 24 గంటల్లో 69,095 నమూనాలు పరీక్షించగా 3,503 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 524 కొత్త కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 48 పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 28 మంది కరోనాతో మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,481కి పెరిగింది. తాజాగా 5,144 మందికి కరోనా నయం అయింది.

ఓవరాల్ గణాంకాలు చూస్తే, ఏపీలో మొత్తం 7,89,553 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7,49,676 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 33,396 మంది చికిత్స పొందుతున్నారు.