ఐపీఎల్ లో నేడు పంజాబ్ వర్సెస్ ఢిల్లీ... టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్

20-10-2020 Tue 19:21
  • దుబాయ్ వేదికగా మ్యాచ్
  • బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • మళ్లీ వచ్చిన పంత్
Delhi Capitals faces Kings Eleven Punjab in IPL

ఐపీఎల్ లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య దుబాయ్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 9 మ్యాచ్ లు ఆడి 7 విజయాలు నమోదు చేసిన ఢిల్లీ జట్టు దాదాపు ప్లేఆఫ్ దశకు చేరినట్టే భావించాలి. మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 9 మ్యాచ్ ల్లో 6 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడోస్థానంలో నిలిచింది.

జట్ల విషయానికొస్తే... పంజాబ్ జట్టులో క్రిస్ జోర్డాన్ స్థానంలో కివీస్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషామ్ కు స్థానం కల్పించారు. ఇక, ఢిల్లీ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. రిషబ్ పంత్, హెట్మెయర్, డేనియల్ శామ్స్ జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించిన పంజాబ్ జట్టు ఆత్మవిశ్వాసం పుంజుకుంది. ఈ మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.