సినీ హాస్య నటుడు పృథ్వీకి రోడ్డు ప్రమాదం

20-10-2020 Tue 18:56
  • బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ప్రమాదం
  • ఆయన వాహనాన్ని ఢీకొన్న మరో కారు
  • ప్రమాదం నిన్న జరిగినట్టు తెలిపిన ఆయన టీమ్
Actor Prudhvi Raj met with road accident

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఉన్న వినాయకుడి గుడి వైపు కారులో ఆయన వెళ్తుండగా... మరో కారు ఆయన వాహనాన్ని ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఆయన కారు ధ్వంసమైంది. ఈ ప్రమాదం నిన్న జరిగిందని పృథ్వీ టీమ్ ఆయన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఈరోజు తెలియజేసింది. అయితే పృథ్వీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం గురించి మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, ఆగస్టులో పృథ్వీ కరోనా బారిన పడి, కోలుకున్న సంగతి తెలిసిందే.