ధోనీ గొప్ప క్రికెటరే.. కానీ, ఆయన వ్యాఖ్యలు సరికాదు: కృష్ణమాచారి శ్రీకాంత్

20-10-2020 Tue 18:32
  • కొందరు యువ ఆటగాళ్లలో ఆడాలనే కసి కనిపించలేదన్న ధోనీ
  • జాదవ్, పియూష్ చావ్లాలో కనిపించిందా? అని ప్రశ్నించిన శ్రీకాంత్
  • స్వయం తప్పిదాలతో చైన్నై ఈ సీజన్ ను ముగిస్తోందని వ్యాఖ్య
Dhonis comments are not correct says Srikanth

ఐపీఎల్ లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో సీఎస్కే టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ, తమ జట్టులోని కొందరు యువ ఆటగాళ్లలో ఆడాలనే కసి కనిపించలేదని చెప్పాడు. ఈ కారణం వల్లే వారికి జట్టులో స్థానం కల్పించలేదని అన్నారు. మిగిలిన మ్యాచుల్లో వారికి అవకాశం కల్పిస్తామని... ఒత్తిడి లేకుండా ఆడుకోవచ్చని చెప్పారు.

ధోనీ వ్యాఖ్యలపై భారత జట్టు మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు. ధోనీ మంచి క్రికెటర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని... అయితే మ్యాచ్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం సమర్థించనని చెప్పారు. జగదీశన్ లాంటి యువ ఆటగాళ్లలో కనిపించని కసి... కేదార్ జాదవ్, పియూష్ చావ్లాలో కనిపించిందా? అని ప్రశ్నించారు. స్వయం తప్పిదాలతో చెన్నై జట్టు ఈ సీజన్ ను లీగ్ దశలోనే ముగిస్తోందని చెప్పారు.