ఇంటింటికీ కేటీఆర్... వరద బాధితులకు ఆర్థికసాయం అందిస్తున్న ఫొటోలు ఇవిగో!

20-10-2020 Tue 15:11
  • హైదరాబాదులో వరద బీభత్సం
  • రూ.10 వేల ఆర్థికసాయం ప్రకటించిన రాష్ట్ర సర్కారు
  • చెక్కులు పంపిణీ చేసిన కేటీఆర్
KTR distributes financial help to flood effected poeple

హైదరాబాదులో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థికసాయం పంపిణీ నేడు మొదలైంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా కొన్ని ఇళ్లకు వెళ్లి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం బాధితులకు అందిస్తున్నారు. ఖైరతాబాద్ లోని ఎంఎస్ మక్తా, రాజు నగర్ ప్రాంతాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ విజయ రెడ్డి కూడా ఉన్నారు.