హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న యువకుడి అరెస్టు

20-10-2020 Tue 13:24
  • హైదరాబాద్‌ యువతను లక్ష్యంగా చేసుకుంటూ డ్రగ్స్ అమ్మకం
  • నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • విద్యార్థి వీసా మీద వచ్చిన డానియల్
drugs peddler arrests in hyderabad

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి సమాచారం సేకరించిన పోలీసులు.. వెస్ట్ జోన్ పరిధిలో ఒకరిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌ యువతను లక్ష్యంగా చేసుకుంటూ డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నిస్తోన్న నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

విద్యార్థి వీసా మీద డానియల్ అనే నైజీరియన్ భారత్‌కు వచ్చాడని, ఇక్కడ చదువుకుంటూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు తాజాగా లంగర్ హౌజ్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకుని, అతడి నుంచి ఆరు గ్రాముల కోకై‌న్‌ను స్వాధీనం చేసుకున్నారు.