రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో జూ.ఎన్టీఆర్ టీజర్‌పై అప్‌డేట్ ఇచ్చిన సినిమా యూనిట్!

20-10-2020 Tue 13:15
  • ఈ నెల 22న విడుదల 
  • తెలుగులో డీవీవీ మూవీస్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల
  • తమిళంలో జూనియర్ ఎన్టీఆర్ అఫిషియల్ యూట్యూబ్ లో
  • హిందీలో అజయ్ దేవగణ్ యూట్యూబ్ లో
  • కన్నడలో వారాహి, మలయాళంలో చరణ్ యూట్యూబ్‌లో 
RRR Movie RamarajuForBheem at 11 AM on October 22nd

'బాహుబలి' సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఇప్పటికే  ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ను ఈ సినిమా యూనిట్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇక కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఈ నెల 22న విడుదల చేయనున్న ఆ సినిమా యూనిట్ ఇప్పటికే ప్రకటన చేసింది. దీని కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఈ టీజర్‌ను ఏయే భాషల్లో ఏయే యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా విడుదల చేస్తామన్న విషయాన్ని ఆ సినిమా యూనిట్ ఈ రోజు తెలిపింది. తెలుగులో డీవీవీ మూవీస్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేస్తామని చెప్పింది. తమిళంలో జూనియర్ ఎన్టీఆర్ అఫిషియల్ యూట్యూబ్ లో, హిందీలో అజయ్ దేవగణ్ యూట్యూబ్ లో, కన్నడలో వారాహి యూట్యూబ్ లో, మలయాళంలో అల్వేస్ రామ్ చరణ్ యూట్యూట్ ఛానెళ్లలో విడుదల చేస్తామని వివరించింది.

కాగా,  రాజమౌళి, స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఆరు నెలల పాటు ఆగిపోయిన షూటింగ్ మళ్లీ ఇటీవలే ప్రారంభమైంది.