Balakrishna: బాలకృష్ణ 'నర్తనశాల' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!

  • స్వీయ దర్శకత్వంలో 'నర్తనశాల' చిత్రాన్ని ప్రారంభించిన బాలయ్య
  • ప్రేక్షకుల ముందుకు రానున్న 17 నిమిషాల చిత్రం
  • ఈ నెల 24న ఎన్బీకే థియేటర్లో శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల
First look poster of Balakrishnas Narthanasala

పౌరాణిక, జానపద చిత్రాలలో దివంగత ఎన్టీఆర్ ఓ వెలుగు వెలిగారు. ఆయన నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన తనయుడు బాలకృష్ణ... ఆయన తర్వాత ఆ పాత్రలకు జీవం పోస్తూ వస్తున్నారు. జానపద, పౌరాణిక చిత్రాలంటే బాలయ్యకు మక్కువ ఎక్కువ.

మరోవైపు దర్శకత్వం వహించాలనే కోరిక కూడా ఆయనలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో స్వీయ దర్శకత్వంలో ఆయన 'నర్తనశాల' అనే చిత్రాన్ని ప్రారంభించారు. అయితే, ఆ చిత్రంలో ద్రౌపది పాత్రను పోషిస్తున్న సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడంతో... ఆ ప్రాజెక్టును బాలయ్య ఆపేశారు.

అప్పుడు షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఈ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు బాలయ్య తీసుకొస్తున్నారు. 17 నిమిషాల చిత్రాన్ని ఈ నెల 24న ఎన్బీకే థియేటర్లో శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేయనున్నట్టు బాలయ్య ప్రకటించారు. కాసేపటి క్రితం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలయ్య అర్జునుడి పాత్రను పోషించగా, ద్రౌపదిగా సౌందర్య, ధర్మరాజుగా శరత్ బాబు, భీముడిగా శ్రీహరి నటించారు.

More Telugu News