మీ హయాంలో రైతులకు జలకళ తప్పిన మాట వాస్తవం కాదా?: దేవినేని ఉమ

20-10-2020 Tue 12:43
  • ప్రతిరైతుకి బోరు అని పథకంలో చెప్పారు
  • ఒకసారి వేస్తే ఉచితంలేదని మెలిక పెట్టారు
  • బోరు ఫెయిల్ అయితే రైతు ఏం చేయాలి?
  • బోరు ఎండిన రైతులు వ్యవసాయానికి దూరం కావాల్సిందేనా?  
devineni uma slams jagan

ఓసారి బోరు వేస్తే ఉచితంగా మరో బోరు వేయడం కుదరదంటూ ఆంధ్రప్రదేశ్ సర్కారు పెట్టిన మెలికతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు  మండిపడ్డారు.

‘ప్రతిరైతుకి బోరు అని పథకంలో చెప్పి ఒకసారి వేస్తే ఉచితంలేదని మెలిక పెట్టారు, బోరు ఫెయిల్ అయితే రైతు ఏం చేయాలి? బోరు ఎండిన రైతులు వ్యవసాయానికి దూరం కావాల్సిందేనా? అర్హత ఉన్నా 1,100 గ్రామాలను ఎందుకు విస్మరించారు? మీ హయాంలో రైతులకు జలకళ తప్పిన మాట వాస్తవం కాదా? చెప్పండి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమా ప్రశ్నించారు.