కొత్త సినిమా కోసం హీరో సూర్య కొత్త లుక్.. ఫొటోలు వైరల్!

20-10-2020 Tue 11:30
  • ‘వాడివాసల్‌’ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్న సూర్య
  • ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం
  • ఒక పాత్రలో జల్లికట్టు క్రీడాకారుడిగా కనపడనున్న సూర్య  
surya new look

విభిన్న కథాంశాలతో ఉండే సినిమాలను చేయడానికి ఇష్టపడే తమిళ హీరో సూర్య కొత్త లుక్‌లో కనపడి అభిమానుల్లో జోష్ నింపాడు. ప్రస్తుతం ఆయన  ‘వాడివాసల్‌’ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలోని పాత్ర కోసమే ఆయన ఇలా కొత్త లుక్‌లో కనపడుతున్నట్లు తెలుస్తోంది.

జల్లికట్టు క్రీడాకారుడిగా కనపడడానికి ఆయన తన గెటప్‌ను మార్చుకున్నట్లు సమాచారం. గడ్డం, పొడవైన మీసాలతో ఆయన కనిపిస్తున్నాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆయన కొత్త లుక్ వైరల్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జల్లికట్టు క్రీడాకారుడి పాత్రలో సూర్య నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.