ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి బాబు: విజయసాయిరెడ్డి

20-10-2020 Tue 10:36
  • అధికారంతో విర్రవీగిన రోజుల్లో బెదిరించారు
  • అంతు చూస్తా, తోక కోస్తా అని బీసీలను ఈసడించుకున్నారు
  • పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు
  • విస్తరిలో వడ్డించేప్పుడే ఆకలి మంటను గుర్తించాలి
vijaya sai slams chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘అధికారంతో విర్రవీగిన రోజుల్లో 'అంతు చూస్తా, తోక కోస్తా' అని బీసీలను బాబు ఈసడించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు బాబు గారూ. విస్తరిలో వడ్డించేప్పుడే ఆకలి మంటను గుర్తించాలి. వాటిని ఎత్తేసేటప్పుడు కాదు’ అని విమర్శించారు.

‘తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందనే సామెత చంద్రబాబుకి చక్కగా సరిపోతుంది. గెలుపోటములు నిర్ణయించేది ప్రజలు. వారి విశ్వాసాన్ని కోల్పేతే ఏ వ్యవస్థా తనను దొడ్డిదారిన అధికార పీఠంపై కూర్చోబెట్టలేదు. అయినా ఆయన భ్రమల్లోంచి బయటకు రాడు. అందరినీ భ్రష్టుపట్టించే వరకు వదలడు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు.