పార్టీ ఆదేశాలను ధిక్కరించారని ఆరోపణ.. లంకా దినకర్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ

20-10-2020 Tue 09:57
  • గత ఎన్నికల్లో ఓటమి అనంతరం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన దినకర్
  • పార్టీకి సమాచారం ఇవ్వకుండానే టీవీ చర్చల్లోకి
  • షోకాజ్ నోటీసుకు ఇవ్వని సమాధానం
Lanka Dinakar suspended from BJP

బీజేపీ నేత లంకా దినకర్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ విధివిధానాలకు వ్యతిరేకంగా పాల్గొంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఇటీవల ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ విధానపరమైన నిర్ణయాలపై ఎలాంటి సమచారం లేకుండా టీవీ చర్చల్లో పాల్గొనవద్దని అందులో పేర్కొంది.

దానికి ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే సొంత అజెండాతో మళ్లీ టీవీ చర్చల్లో పాల్గొంటుండడాన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న ఆదేశాలు జారీ చేశారు. గతంలో టీడీపీలో పనిచేసిన లంకా దినకర్ గత ఎన్నికల్లో ఓటమి అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.