CSK: పేలవంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్... రాజస్థాన్ లక్ష్యం 126 రన్స్

Chennai Super Kings posted low total against Rajasthan Royals
  • అబుదాబిలో చెన్నై వర్సెస్ రాజస్థాన్
  • మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్
  • 35 పరుగులు చేసిన జడేజా
  • 28 పరుగులు సాధించి రనౌటైన ధోనీ

అబుదాబిలో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ స్వల్ప స్కోరుతో సరిపెట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసింది. 35 పరుగులు చేసిన రవీంద్ర జడేజానే టాప్ స్కోరర్.

కెప్టెన్ ధోనీ 28 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఓపెనర్ శామ్ కరన్ 22 పరుగులు నమోదు చేశాడు. మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ 10, షేన్ వాట్సన్ 8 పరుగులకే అవుటయ్యారు. రాజస్థాన్ బౌలర్లు ఈ మ్యాచ్ లో ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లారు. ఆర్చర్, త్యాగి, శ్రేయాస్ గోపాల్, తెవాటియా తలో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News