కేసీఆర్ విన్నపంపై వెంటనే స్పందించిన జగన్

19-10-2020 Mon 21:02
  • హైదరాబాద్ కు భారీ వర్ష సూచన
  • స్పీడ్ బోట్లను పంపించాలని జగన్ ను కోరిన కేసీఆర్
  • వెంటనే పంపించాలని అధికారులను ఆదేశించిన జగన్
Jagan responds immediately to KCRs request

భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. నగరంలోని పలు కాలనీలు వరద నీటిలో ముగిగాయి. ఇంకోవైపు మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీడ్ బోట్లను అందబాటులో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో సహాయ చర్యల నిమిత్తం స్పీడ్ బోట్లను పంపించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

కేసీఆర్ విన్నపంపై వెంటనే స్పందించిన జగన్... తెలంగాణ ప్రభుత్వం కోరిన సాయాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా స్పీడ్ బోట్లను తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.