Anika Chebrolu: భారత సంతతి అమెరికా తెలుగు విద్యార్థిని అనిక చేబ్రోలుకు అవార్డు.. ఉపరాష్ట్రపతి అభినందనలు

  • 3ఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్ లో విజేతగా నిలిచిన అనిక
  • కరోనా వైరస్ ప్రొటీన్ ను బంధించే అణువుకు రూపకల్పన
  • అమెరికాలో 8వ గ్రేడ్ చదువుతున్న అనిక
Vice President of India Venkaiah Naidu appreciates Anika Chebrolu who won young scientist challenge

అమెరికాలోని భారత సంతతి తెలుగు విద్యార్థిని అనిక చేబ్రోలు 3ఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్ లో విజేతగా నిలిచింది. 2020 ఏడాదికి గాను అనిక చేబ్రోలు ఈ అవార్డును అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం కరోనాను కట్టడి చేసేందుకు తీవ్రస్థాయిలో పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనిక చేబ్రోలు కరోనా వైరస్ ప్రొటీన్ ను బంధించి, దాన్ని సమర్థంగా నియంత్రించే అణువును రూపొందించింది.

ఈ అణువు కరోనాను నియంత్రించే ఔషధాల రూపకల్పనలో విశేషంగా తోడ్పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. కరోనా వైరస్ పై పరిశోధనల్లో అనిక చూపించిన ప్రజ్ఞ అంతర్జాతీయస్థాయిలో గుర్తింపుకు నోచుకుంది. 3ఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్ అవార్డు కింద ఆమెకు 25,000 డాలర్ల నగదు బహుమతి లభించనుంది. అనిక చేబ్రోలు టెక్సాస్ లోని ఫ్రిస్కో ప్రాంతంలో నివసిస్తోంది. 14 ఏళ్ల అనిక ప్రస్తుతం 8వ గ్రేడ్ చదువుతోంది.

More Telugu News