ధోనీ@200... రాజస్థాన్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

19-10-2020 Mon 19:28
  • అబుదాబిలో నేడు చెన్నై వర్సెస్ రాజస్థాన్
  • ఐపీఎల్ లో 200వ మ్యాచ్ ఆడుతున్న ధోనీ
  • రెండు మార్పులతో బరిలో దిగుతున్న చెన్నై
Chennai Super Kings won the toss in crucial game

ఐపీఎల్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇవాళ ఆడుతున్న చెన్నై, రాజస్థాన్ జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. ఇరుజట్లు చెరో 9 మ్యాచ్ లు ఆడి సరిగ్గా ఆరేసి ఓటములు చవిచూశాయి.

ఇక, ముఖ్యమైన అంశం ఏమిటంటే... ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఐపీఎల్ లో 200వ మ్యాచ్. దాంతో అందరి దృష్టి ధోనీపైనే ఉండనుంది. విశేషం ఏంటంటే... తన 50వ, 100వ ఐపీఎల్ మ్యాచ్ లలో ధోనీ నాయకత్వంలో చెన్నై జట్టు విజయం సాధించింది. ఇప్పుడు 200వ మ్యాచ్ లోనూ ధోనీ సేనదే విజయమని అభిమానులు భావిస్తున్నారు.

మ్యాచ్ విషయానికొస్తే... రాజస్థాన్ రాయల్స్ లో లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ స్థానంలో అంకిత్ రాజ్ పుత్ ను తీసుకున్నారు. చెన్నై జట్టులో రెండు మార్పులు చేశారు. గాయపడ్డ డ్వేన్ బ్రావో స్థానంలో జోష్ హేజెల్ వుడ్, లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ స్థానంలో పియూష్ చావ్లా జట్టులోకి వచ్చారు.