Dubbaka: దుబ్బాక ఉపఎన్నిక: చివరకు బరిలో మిగిలిన అభ్యర్థులు 23 మంది

23 candidates remained in Dubbaka bypolls after withdrawal of nominations
  • మొత్తం దాఖలైన నామినేషన్లు 46
  • 12 నామినేషన్ల తిరస్కరణ
  • నామినేషన్లను ఉపసంహరించుకున్న 11 మంది
దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, నేతలు ప్రచారపర్వంలో మునిగిపోయారు. ఇదే సమయంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు ఈరోజుతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది.

ఇక తొలుత మొత్తం 46 మంది నామినేషన్లు వేయగా.. అందులో 12 నామినేషన్లు సరిగా లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు. దీంతో 34 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టైంది. అయితే ఈరోజు మరో 11 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో చివరకు 23 మంది ఎన్నికల బరిలో మిగిలారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది.
Dubbaka
By Polls
Niminations
Total candidates

More Telugu News