V Srinivas Goud: పాలమూరు దరిద్రానికి కాంగ్రెస్ పార్టీనే కారణం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

Srinivas Goud fires on Congress Party
  • ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు
  • పాలమూరు ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది
  • గత సీఎంలు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. పాలమూరు దరిద్రానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని అన్నారు. పాలమూరు ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నారని... దీనికంతా కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.

ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని... అందుకే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే... ప్రజల్లో వారే చులకన అవుతారని అన్నారు. గత ముఖ్యమంత్రులు ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ఎల్లూరు ప్రాజెక్టులో పైపుల మునక సాంకేతిక లోపం అయ్యుండొచ్చని చెప్పారు.

V Srinivas Goud
TRS
Palamuru

More Telugu News