ఏపీ టీడీపీ చీఫ్ గా నియమించడం పట్ల అచ్చెన్నాయుడి స్పందన

19-10-2020 Mon 14:32
  • పార్టీలో భారీగా మార్పులు చేసిన చంద్రబాబు
  • అచ్చెన్నకు రాష్ట్ర బాధ్యతలు
  • సంతోషం వ్యక్తం చేసిన అచ్చెన్న
Atchennaidu responds after TDP high command appointed him as AP TDP President

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీకి కొత్త రూపు కల్పించే క్రమంలో భారీస్థాయిలో మార్పులుచేర్పులు చేశారు. నూతన పొలిట్ బ్యూరోను, అనేక కమిటీలను ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని నియమించారు. రాష్ట్ర టీడీపీ బాధ్యతలు తనకు అప్పగించడం పట్ల అచ్చెన్నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ రోజు మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలతో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితుడ్నయ్యానని అచ్చెన్న ట్విట్టర్ లో వెల్లడించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తనకు ఈ అవకాశం కల్పించారని వివరించారు. 'మీ ఆశీస్సులు, మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నా.. మీ కింజరాపు అచ్చెన్నాయుడు' అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.