ppe: ఆసుపత్రిలో కరోనా రోగుల ముందు డాక్టర్‌ డ్యాన్స్.. వీడియో వైరల్

doctor dances in hospital
  • అసోంలోని ఆసుపత్రిలో ఘటన
  • డ్యాన్స్ చేసిన డాక్టర్‌ అరూప్‌ సేనాపతి
  • పేషెంట్లను  ఉత్సాహపరిచేందుకు డ్యాన్స్
అసోంకు చెందిన డాక్టర్‌ అరూప్‌ సేనాపతి ఆసుపత్రిలో డ్యాన్స్ చేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు సేవలు అందిస్తోన్న సమయంలో ఇలా డ్యాన్స్ చేశారు. కరోనా పేషెంట్లను ఉత్సాహపరిచేందుకు పీపీఈ కిట్‌ లోనే ఆయన డ్యాన్స్ చేశారు.  

'వార్‌' సినిమాలోని ఘంగ్రూ పాటకు  ఆయన స్టెప్పులు వేయడాన్ని అతని సహోద్యోగి డాక్టర్‌ ఫైజన్‌ అహ్మద్ వీడియో తీసి‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ఈ వీడియో వైరల్ అవుతోంది. అసోంలోని సిల్చార్‌ మెడికల్‌ కాలేజీలో ఆయన డ్యాన్స్ చేశారని ఫూజన్ వివరించారు. ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా చూశారు. ఇటువంటి వైద్యులు ఉంటే పేషెంట్లకు బాధలు ఉండవంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ppe
Viral Videos
Corona Virus

More Telugu News