Telugudesam: టీడీపీ పొలిట్ బ్యూరోను ప్రకటించిన చంద్రబాబు.. కమిటీ వివరాలు!

Politburo members of Telugudesam
  • 25 మందితో పొలిట్ బ్యూరోను ప్రకటించిన చంద్రబాబు
  • పొలిట్ బ్యూరో సభ్యులుగా బాలకృష్ణ, అనిత
  • అధికార ప్రతినిధులుగా తెలంగాణ నుంచి ఐదుగురికి అవకాశం
తెలుగుదేశం కమిటీలను ఆ పార్టీ  అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్.రమణను నియమించారు.

పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొండా ఉమ, ఫరూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్ కుమార్ గౌడ్ ను నియమించారు. పొలిట్ బ్యూరోలో నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, ఎల్.రమణ కూడా ఉన్నారు. వీరు ముగ్గురు ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉంటారు.
Telugudesam
Politburo Members
Chandrababu

More Telugu News