Telugudesam: రెండు రాష్టాలకు అధ్యక్షులను నియమించిన చంద్రబాబు.. కమిటీలలో నందమూరి బాలకృష్ణ, సుహాసినికి చోటు!

Chandrababu announeces AP and TS committees
  • ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు
  • టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ
  • పొలిట్ బ్యూరో సభ్యుడిగా బాలకృష్ణ
ఇరు తెలుగు రాష్టాలకు పార్టీ కమిటీలను అధినేత చంద్రబాబు నియమించారు. ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణను నియమించారు. టీటీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసినిని ప్రకటించారు. 27 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీని, 25 మందితో పొలిట్ బ్యూరో కమిటీని ఏర్పాటు చేశారు. పొలిట్ బ్యూరోలో నందమూరి బాలకృష్ణకు స్థానం కల్పించారు. సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా నారా లోకేశ్ ను నియమించారు. సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులుగా ముగ్గురు మహిళలకు స్థానం కల్పించారు.
Telugudesam
Andhra Pradesh
Telangana
Committe
Chandrababu
Atchannaidu
l ramana
Nandamuri Suhasini
Balakrishna

More Telugu News