KCR: ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడబోతున్న సీఎం కేసీఆర్ దత్తపుత్రిక

pratyusha going to marry
  • హైదరాబాద్ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో నిశ్చితార్థం
  • రాంనగర్ ప్రాంతానికి చెందిన చరణ్ రెడ్డితో త్వరలో వివాహం
  • ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తోన్న ప్రత్యూష
పినతల్లి, కన్న తండ్రి చేతుల్లో మూడేళ్ల క్రితం చిత్రహింసలకు గురైన ప్రత్యూష అనే అమ్మాయిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆమె సంరక్షణ బాధ్యతలను ఐఏఎస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించగా, ఆ అధికారి పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యూష యోగక్షేమాలను చూస్తోంది. కేసీఆర్ దత్తపుత్రికకు ఆమె ప్రేమించిన వ్యక్తితో తాజాగా నిశ్చితార్థం జరిగింది.

హైదరాబాద్ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో ఈ వేడుక జరిగింది. హైదరాబాద్ రాంనగర్ ప్రాంతానికి చెందిన చరణ్ రెడ్డితో నిరాడంబరంగా జరిగిన ప్రత్యూష నిశ్చితార్థ వేడుకను సీఎం కేసీఆర్ ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య పర్యవేక్షించారు. కాగా, కేసీఆర్ దత్తత తీసుకున్న అనంతరం ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి కుదుట పడింది. అంతేగాక, నర్సింగ్ కోర్సును పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె పని చేస్తోంది.


KCR
Telangana
marriage

More Telugu News