Samanta: త్రివిక్రమ్ సినిమాలో మరోసారి సమంత?

Samanta to be part of Trivikram flick
  • ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ సినిమా  
  • ప్రస్తుతం జోరుగా ప్రీ ప్రొడక్షన్ పనులు
  • సమంతతో ప్రస్తుతం సంప్రదింపులు
  • అమెరికా బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా
ప్రస్తుతం తెలుగులో 'జాను'తో పాటు, తమిళంలో నయనతారతో కలసి ఓ చిత్రంలో నటిస్తున్న అందాలతార సమంత తాజాగా 'ద ఫ్యామిలీ మెన్ 2' వెబ్ సీరీస్ లో నటిస్తోంది. ఇది త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అమెరికా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ చిత్రంలో ఓ కథానాయికగా సమంతను పరిశీలిస్తున్నట్టు, ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అత్తారింటికి దారేది', 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలలో సమంత కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
Samanta
Trivikram Srinivas
Junior NTR
The Family man

More Telugu News