Anitha: తల్లి కాబోతున్న నటి అనిత... సీమంతం చిత్రాలు వైరల్!

Actress Anitha Turned Mom
  • 2013లో రోహిత్ ను వివాహం చేసుకున్న అనిత
  • ఇటీవల జరిగిన సీమంతం చిత్రాలు పోస్ట్
  • వెల్లువెత్తుతున్న లైక్స్
టాలీవుడ్ తో పాటు దక్షిణాదిన విజయవంతమైన సినిమాల్లో తళుక్కున మెరిసిన తారగా గుర్తుండిపోయిన అనిత ఇప్పుడు తల్లి కాబోతోంది. 2013లో రోహిత్ రెడ్డిని వివాహమాడిన ఆమె, దాదాపు ఏడేళ్ల తరువాత తమ బిడ్డను స్వాగతించనుంది. తాజాగా జరిగిన సీమంతం చిత్రాలను అనిత నెట్టింట పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి.

తనకు ఓ పెద్ద బేబీ పుట్టబోతున్నాడని ఆమె పెట్టిన కామెంట్ కు లైక్స్ వెల్లువెత్తుతున్నాయి. తన కడుపులో బిడ్డ కుడివైపునకు ఎక్కువగా కదులుతున్నాడని, ఈ ఫోటోల్లో చూడవచ్చని కూడా అనిత చెప్పింది. కాగా, తెలుగులో 'నువ్వు నేను'తో పాటు పలు చిత్రాల్లో అనిత నటించిన సంగతి తెలిసిందే.
Anitha
Rohit Reddy
BabyShower
Actress

More Telugu News