కోహ్లీ, అనుష్క సయ్యాట... క్లిక్ మనిపించిన ఏబీ డివిలియర్స్

18-10-2020 Sun 22:18
Kohli and Anushka relaxed in Gulf waters as ABD clicked a photograph
  • ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న కోహ్లీ
  • ఇటీవలే యూఏఈ వెళ్లిన అనుష్క
  • సంధ్యాసమయంలో అద్భుతమైన ఫొటో

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్నాడు. కోహ్లీ సారథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ లో దూసుకుపోతోంది. గత సీజన్ల పరాజయాలను రూపుమాపేలా ఘనవిజయాలు సాధిస్తూ జోరుమీదుంది. విజయానందంలో ఉన్న కోహ్లీకి తన అర్ధాంగి అనుష్క కూడా యూఏఈ రావడంతో మరింత ఉత్సాహం పెరిగింది.

ఈ నేపథ్యంలో, తన అర్ధాంగి అనుష్కతో జలకాలాటలో సేదదీరుతుండగా బెంగళూరు జట్టుకు చెందిన మరో ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన కెమెరాలో బంధించాడు. ఓ చారిత్రక కట్టడానికి సమీపంలో కోహ్లీ, అనుష్క సయ్యాటను క్లిక్ మనిపించాడు. సంధ్యాసమయంలో తీసిన ఈ ఫొటోను కోహ్లీ స్వయంగా షేర్ చేశాడు. పోస్టు చేసిన గంటలోనే 5.7 వేల రీట్వీట్లు, 66.9 వేల లైకులు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.