Sunrisers: సూపర్ ఓవర్ లో 2 పరుగులు చేసి చేజేతులా ఓడిన సన్ రైజర్స్

  • ఐపీఎల్ లో ఉత్కంఠభరితంగా మ్యాచ్
  • సూపర్ ఓవర్ లో చేతులెత్తేసిన సన్ రైజర్స్
  • థ్రిల్లింగ్ మ్యాచ్ లో విజయం సాధించిన కోల్ కతా
Sunrisers lost to KKR in super over

అబుదాబిలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ హోరాహోరీగా సాగినా సూపర్ ఓవర్ లో సన్ రైజర్స్ దారుణంగా ఆడింది. సూపర్ ఓవర్ లో కేవలం 2 పరుగులు చేసి తన ఓటమికి తానే కారణమైంది. సూపర్ ఓవర్ లో సన్ రైజర్స్ తరఫున వార్నర్, బెయిర్ స్టో బరిలో దిగారు. అయితే కోల్ కతా బౌలర్ లాకీ ఫెర్గుసన్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వార్నర్ ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సమద్ కూడా బౌల్డ్ కావడంతో 2 పరుగులే వచ్చాయి.

ఇక కోల్ కతా తరఫున దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ సూపర్ ఓవర్ ఆడారు. సన్ రైజర్స్ తరఫున రషీద్ ఖాన్ బౌలింగ్ చేశాడు. అయితే ఎంత ప్రయత్నించినా కోల్ కతా విజయాన్ని అడ్డుకోలేకపోయాడు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా  20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులే చేసింది. దాంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు.

కాగా. ఈ మ్యాచ్ ద్వారా సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ లో 5000 వేల పరుగులు సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వార్నర్ 135 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత అందుకున్నాడు.

More Telugu News