ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్... ఇద్దరు మావోయిస్టుల హతం!

18-10-2020 Sun 19:27
Encounter at Mulugu district
  • ఇటీవలే టీఆర్ఎస్ నేతను హత్య చేసిన మావోలు
  • ములుగు జిల్లాలో భారీగా కూంబింగ్
  • నరసింహసాగర్ వద్ద పోలీసులు, మావోల మధ్య కాల్పులు

తెలంగాణలోని ములుగు జిల్లా నరసింహసాగర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. మంగంపేట అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది.  మంగంపేట మండలం నరసింహసాగర్ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా కొప్పుగుట్ట వద్ద మావోయిస్టులు తారసపడడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఇటీవలే వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును మావోలు హత్య చేశారు. దాంతో పోలీసులు ఈ ప్రాంతంలో తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్ కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై పోలీసు వర్గాల నుంచి ఇంకా ప్రకటన రాలేదు.