పంజాబ్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్

18-10-2020 Sun 19:12
Mumbai Indians won the toss
  • దుబాయ్ లో ముంబయి వర్సెస్ పంజాబ్
  • ఫేవరెట్ గా బరిలో దిగుతున్న ముంబయి
  • క్రిస్ గేల్ రాకతో బలంగా కనిపిస్తున్న పంజాబ్

ఐపీఎల్ లో నేడు జరిగే రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో ముంబయి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించిన ముంబయి ఈ పోరులో ఫెవరెట్ గా నిలుస్తోంది.

మరోవైపు కేఎల్ రాహుల్ నాయకత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చెత్త ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఆ జట్టు 8 మ్యాచ్ లు ఆడి ఆరింట ఓడిపోయింది. అయితే విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ ఆడిన గత మ్యాచ్ లో గెలవడం పంజాబ్ కు కొద్దిగా సానుకూలాంశం.