కోల్ కతాపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

18-10-2020 Sun 15:16
Sunrisers Hyderabad opt to bowling first after won the toss against KKR
  • ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు
  • తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ వర్సెస్ కోల్ కతా
  • సన్ రైజర్స్ జట్టులో థంపీ, సమద్ లకు చోటు

ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనుండగా, తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

కోల్ కతా జట్టులో న్యూజిలాండ్ స్పీడ్ స్టర్ లాకీ ఫెర్గుసన్ ఎంట్రీ ఇచ్చాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను కూడా తుదిజట్టులోకి తీసుకున్నారు. క్రిస్ గ్రీన్, ప్రసిద్ధ్ కృష్ణలకు ఉద్వాసన పలికారు. సన్ రైజర్స్ జట్టులో కూడా మార్పులు చేశారు. ఖలీల్ అహ్మద్ స్థానంలో ఆల్ రౌండర్ బాసిల్ థంపీని జట్టులోకి తీసుకున్నారు. షాబాజ్ నదీమ్ స్థానంలో అబ్దుల్ సమద్ జట్టులోకి వచ్చాడు.

కాగా, నేడు జరిగే రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనున్నాయి.