ఇటలీ షూటింగ్ లో ఇబ్బందులపై పూజా హెగ్డే వివరణ
- ప్రభాస్ రాధేశ్యామ్ లో నటిస్తున్న పూజా హెగ్డే
- ఇటలీలో తాజా షెడ్యూల్
- అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానమన్న పూజా
"ఇటలీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. షూటింగ్ లో తొలి రెండ్రోజలు చాలా భయంగా అనిపించింది. ఎంతో ఇబ్బందిగా ఫీలయ్యాను. ఆ తర్వాత మామూలుగా అనిపిస్తోంది. ఇటలీ పరిస్థితులకు అలవాటు పడిపోయాను. ఇటలీలో ఎంతో జాగ్రత్తగా షూటింగ్ చేస్తున్నాం. చిన్న సెట్ వేసుకుని, చాలా తక్కువమందితో చిత్రీకరణ చేస్తున్నాం. సెట్ లోకి అడుగుపెట్టేముందు అందరికీ కరోనా టెస్టులు తప్పనిసరి. సెట్ లో ఉంటే మాస్కు వేసుకోవాల్సిందే. కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మాస్కు తీసేస్తున్నాం" అని వెల్లడించారు.