మరోసారి మేమే అమెరికాలో అధికారంలోకి వస్తాం!: ట్రంప్‌

18-10-2020 Sun 13:00
we will form govt again trump
  • రిపబ్లికన్‌ పార్టీనే ప్రజలు గెలిపించాలి
  • ఈ ఎన్నికలు దేశ చరిత్రలోనే అంత్యంత కీలకం
  • ఇప్పటి వరకు పాలన సజావుగా సాగింది

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ తానే గెలుస్తానని, మరో నాలుగేళ్లు తమ దేశానికి అధ్యక్షుడిని తానేనని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా మిచిగాన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌ పాల్గొని మాట్లాడుతూ..  ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీదే విజయమని, గతంలో లాగే రిపబ్లికన్‌ పార్టీనే ప్రజలు గెలిపించాలని కోరారు. భవిష్యత్‌లోనూ ప్రజలు ఇలాగే మద్దతు ఇవ్వాలని చెప్పారు.

ఈ ఎన్నికలు తమ దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైనవని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజలకు అధికారాలిచ్చే దిశగా తాము పని చేస్తున్నామని అన్నారు.  దేశ ప్రజల మద్దతుతో ఇప్పటి వరకు పాలన సజావుగా సాగిందని తెలిపారు. తమ‌ పార్టీకి మరోసారి అధికారమివ్వాలని, అమెరికాకు మరింత సేవ చేసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 3న జరగనున్నాయి.