కేసీఆర్ గారూ.. మీ వల్ల 60 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది: సీతక్క

18-10-2020 Sun 11:44
Seethakka asks KCR not to go to Farm House
  • ఫామ్ హౌస్ కు ప్రయాణాలు చేయవద్దు
  • మీ ప్రయాణాలతో ట్రాఫిక్ జామ్ అవుతోంది
  • జనాలు కూడా ఇంటికి వెళ్లాలి కదా

దయచేసి మీరు ప్రయాణాలు చేయవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కోరారు. మీ 300 ఎకరాల ఫామ్ హౌస్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి మీరు చేసే ప్రయాణాల వల్ల 60 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోందని ఆమె అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ జామ్ అవుతోందని... వాళ్లు కూడా సేఫ్ గా ఇంటికి చేరుకోవాలి కదా సార్ అని కామెంట్ చేశారు.

దయచేసి ఈ విషయంపై ఒకసారి ఆలోచించాలని అన్నారు. కేసీఆర్ తరచుగా తన ఫామ్ హౌస్ కు వెళ్తుంటారనే విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ ను ఆపేస్తారు. ఈ నేపథ్యంలోనే సీతక్క పైవిధంగా వ్యాఖ్యానించారు. దీనికి తోడు సీఎం కాన్వాయ్ వీడియోను షేర్ చేశారు.