TS DGP: పీహెచ్‌డీ పట్టా అందుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి

  • పోలీసింగ్, భద్రతలో ఐటీ వినియోగంపై అధ్యయనం
  • పట్టా అందించిన జేఎన్‌టీయూహెచ్
  • పరిశోధన పోలీసులకు ఉపయోగపడుతుందన్న డీజీపీ
dgp receives phd

పోలీసింగ్, సమాజ భద్రతలో సమాచార సాంకేతికత వినియోగంపై పదేళ్లుగా అధ్యయనం చేసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తాజాగా పీహెచ్‌డీ పట్టా అందుకుని విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. జేఎన్‌టీయూహెచ్ తొమ్మిదవ స్నాతకోత్సవంలో ఆయనకు ఆ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ జయేశ్‌రంజన్ పట్టాను అంద‌జేశారు.

ఈ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ వర్చువల్ పద్ధతిలో రాజ్ భవన్ నుంచి పాల్గొన్నారు. కాగా, తన పీహెచ్‌డీ పూర్తి చేయడంలో సాయపడ్డ గైడ్ తో పాటు ఇతర సభ్యులకు మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన పరిశోధన రాష్ట్ర పోలీసులకు ఉపయోగపడుతుందని చెప్పారు. పీహెచ్‌డీ పట్టా అందడం పట్ల సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.

More Telugu News