Bihar: బీహార్ రెండో విడత ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ

BJP Releases second phase election star campaigners list
  • ఈ నెల 28న తొలి విడత, వచ్చే నెల 3న రెండో విడత ఎన్నికల పోలింగ్
  • జాబితాలో ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ నడ్డా, అమిత్ షా పేర్లు
  • ప్రచారంలో పాల్గొనున్న యూపీ సీఎం ఆదిత్యనాథ్, స్మృతి ఇరానీ తదితరులు
బీహార్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ రెండో దశ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. రెండో దశలో ప్రచారం చేయనున్న వారిలో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ జగత్ ప్రకాశ్ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీఎల్ సంతోష్ తదితరులు ఉన్నారు. అలాగే, బీహార్ బీజేపీ నేత భూపేంద్ర యాదవ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చారు.

ఇక ఎన్నికల ప్రచారంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ మాజీ సీఎం రఘువరదాస్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్ వంటి వారు కూడా పాల్గొననున్నారు.  రాష్ట్రంలో ఈ నెల 28న తొలి విడత పోలింగ్ జరగనుండగా, నవంబరు 3న రెండో విడత, 7న మూడో విడత పోలింగ్ జరగనుంది. 10న ఫలితాలను వెల్లడించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలు ఉండగా, వీటిలో 38 సీట్లను ఎస్సీ ఎస్టీలకు కేటాయించారు. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఖాళీ అయిన మరో 64 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
Bihar
Assembly elections
BJP
Narendra Modi
JP Nadda

More Telugu News