ఈ విషయం నేను 10 రోజుల కిందటే చెప్పా: రఘురామకృష్ణరాజు

17-10-2020 Sat 21:34
Raghurama Krishna Raju responds to media news
  • జగన్ సర్కారుకు టీటీడీ నిధులు అంటూ మీడియాలో కథనాలు
  • అందరూ ఏకతాటిపై వచ్చి దీన్ని ఎదుర్కోవాలన్న రఘురామ
  • అన్యాయాన్ని అడ్డుకుందామని పిలుపు

టీటీడీ నిధులు ఏపీ సర్కారుకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అబ్బాయ్ సేవలో బాబాయ్... వెంకన్న సొమ్ము జగనన్న సర్కారుకు అంటూ మీడియాలో వచ్చిన కథనాల పట్ల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఇదే విషయాన్ని 10 రోజుల కిందటే తాను రచ్చబండ మీడియా సమావేశంలో వెల్లడించానని తెలిపారు.

తిరుమల దేవదేవుడికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్ర పన్నాగాన్ని మనందరం నిలువరించాల్సిన అవసరం ఉందని, ఏకతాటిపైకి వచ్చి దీన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వారిని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని, అయితే అందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి అన్యాయాన్ని అడ్డుకుందాం అని సూచించారు. అంతేకాదు, ఈ అంశంపై ఓ పత్రికలో వచ్చిన క్లిప్పింగ్ ను కూడా ఆయన పంచుకున్నారు.