డీడీసీఏ అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ కుమారుడు ఏకగ్రీవం

17-10-2020 Sat 20:00
Rohan Jaitly elected as DDCA President
  • ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ ఎన్నిక
  • రోహన్ పై ఎవరూ పోటీ చేయని వైనం
  • 2021 జూన్ వరకు పదవిలో ఉండనున్న రోహన్

కేంద్ర మాజీ మంత్రి, దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ కీలక పదవికి ఎంపికయ్యారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన ఘన విజయం సాధించారు. ఈ రోజు జరిగిన ఎన్నికలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021 జూన్ 30 వరకు ఈ పదవిలో రోహన్ కొనసాగనున్నారు.

వాస్తవానికి న్యాయవాద వృత్తిలో కొనసాగాలని రోహన్ భావించారు. కానీ నేతలు, స్థానిక అధికారుల సూచనలతో ఆయన డీడీసీఏ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. ఆయనకు పోటీగా ఎవరూ నిలవకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రోహన్ కు పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధ్యక్ష పదవికి రజత్ శర్మ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ పదవికి ఎన్నికలు జరిగాయి.