సీఎం కేసీఆర్ పై మర్డర్ కేసు పెట్టాలి: రాజాసింగ్

17-10-2020 Sat 19:19
Murder has to be filed on KCR says Raja Singh
  • భారీ వర్షాలతో హైదరాబాదులో పలువురి మృతి
  • ఈ మరణాలకు ప్రభుత్వమే కారణమన్న రాజాసింగ్
  • బాధితులను కేసీఆర్ పరామర్శించాలని డిమాండ్

భారీ వర్షాల కారణంగా హైదరాబాదులో పలువురు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంతమంది ప్రాణాలు పోవడానికి ప్రభుత్వ అలసత్వమే కారణమని... కేసీఆర్ పై మర్డర్ కేసు పెట్టాలని అన్నారు. మూసీనది పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు తీవ్రంగా నష్టపోయారని... వారిని కేసీఆర్ పరామర్శించాలని డిమాండ్ చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే ఎంఐఎం అధినేత ఒవైసీతో కలిసి మంత్రి కేటీఆర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారని రాజాసింగ్ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ బలం చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో తనకు విభేదాలు లేవని చెప్పారు.