పాపం.. చంద్రబాబును ఎవ్వరూ ఏమీ అనొద్దు!: విజయసాయిరెడ్డి

17-10-2020 Sat 19:07
Vijayasai Reddy satires on Chandrababu
  • జగన్ కు 30 ఏళ్ల వరకు శిక్ష పడొచ్చన్న చంద్రబాబు
  • చంద్రబాబు తనను తాను జడ్జి అనుకుంటున్నాడన్న విజయసాయి
  • తనను తాను పూర్తిగా మర్చిపోయాడని వ్యంగ్యం

ఏపీ సీఎం జగన్ పై అవినీతి కేసులు నిరూపణ అయితే, 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని ఏడీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు ఉటంకించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు.

చంద్రబాబుకు స్క్రిజోఫీనియా ముదిరిపోయిందని వ్యాఖ్యానించారు. అల్జీమర్స్ ఆఖరి దశలోకి వెళ్లిపోయిందని, చంద్రబాబు తనను తాను పూర్తిగా మర్చిపోయాడని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పుడు తనను తాను జడ్జి పాత్రలో ఊహించుకుంటున్నాడని, ఆ క్యారెక్టర్ లో తీర్పు కూడా ఇచ్చేశాడని ఎద్దేవా చేశారు. పాపం... చంద్రబాబును ఎవ్వరూ ఏమీ అనొద్దు! అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.