డీకే అరుణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

17-10-2020 Sat 18:12
BJP leader DK Aruna arrested
  • మునిగిన కేఎల్ఐ ప్రాజెక్టు మోటార్లను పరిశీలించేందుకు వెళ్లిన అరుణ
  • కల్వకుర్తి వద్ద అడ్డుకున్న పోలీసులు
  • నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేసిన అరుణ

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను వనపర్తి జిల్లా కల్వకుర్తి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద నీట మునిగిన కేఎల్ఐ ప్రాజెక్టు మోటార్లను పరిశీలించేందుకు డీకే అరుణ బయల్దేరారు. ఈ నేపథ్యంలో కల్వకుర్తి వద్ద ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అరుణ... కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. మంత్రులను అనుమతించినప్పుడు తనను ఎందుకు అనుమతించడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, అరుణతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.