పథకాలకు జగన్ పేర్లు పెట్టడానికి కారణం ఇదే: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి

17-10-2020 Sat 17:33
Jagan will go to jail says Pattabhi
  • జగన్ జైలుకు పోవడం ఖాయం
  • 60 శాతం ప్రభుత్వ ప్రకటనలు సాక్షికే ఇస్తున్నారు
  • అన్ని కార్పొరేషన్ల నిధులను అమ్మఒడి పథకానికి మళ్లించారు 

ముఖ్యమంత్రి జగన్ జైలుకు పోవడం ఖాయమని... అందుకే అన్ని పథకాలకు ఆయన పేరు పెడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసేది తక్కువ... ప్రచారం చేసుకునేది ఎక్కువని విమర్శించారు. ప్రభుత్వ ప్రకటనల కోసం ఖర్చు చేస్తున్న బడ్జెట్లో 50 నుంచి 60 శాతం సాక్షి పత్రికకే ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. సాక్షి ప్రతికల్లో వచ్చే వార్తలే కాకుండా, ప్రకటనలు కూడా అబద్ధాలేనని ఎద్దేవా చేశారు.

కులాల ప్రాతిపదికన అమలు కాని పథకాలను ప్రకటనల్లో చూపిస్తున్నారని పట్టాభి మండిపడ్డారు. ఇప్పటికే అన్ని కార్పొరేషన్ల నిధులను అమ్మఒడి పథకానికి మళ్లించారని అన్నారు. బీసీ కార్పొరేషన్ కు చిల్లిగవ్వ కూడా లేదని... అలాంటప్పుడు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఏం ఉపయోగమని ప్రశ్నించారు. బీసీల కోసం కేటాయించిన నిధులను ఏ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.