కంగనా రనౌత్‌పై కేసు నమోదు

17-10-2020 Sat 17:01
Mumbai police registers case against Kangana Ranaut
  • కంగనపై క్యాస్టింగ్ డైరెక్టర్ కేసు
  • విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపణ
  • కేసు నమోదు చేయాలన్న బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టు

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ క్యాస్టింగ్ డైరెక్టర్, ఫిట్ నెస్ ట్రైనర్ మున్నావరలీ సయ్యద్ ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో కంగన సోదరి రంగోలి పేరును కూడా చేర్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది.