బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

17-10-2020 Sat 15:43
Rajasthan Royals has won the toss against Royal Challengers Banglore
  • ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు
  • తొలి మ్యాచ్ లో బెంగళూరు వర్సెస్ రాజస్థాన్
  • బెంగళూరు జట్టులో మాన్, అహ్మద్ లకు చోటు

ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నిలుస్తున్న ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

బెంగళూరు జట్టులో షాబాజ్ అహ్మద్, గుర్ కీరత్ సింగ్ మాన్ లను తీసుకున్నారు. శివం దూబే, మహ్మద్ సిరాజ్ లను తప్పించారు. ఇక రాజస్థాన్ జట్టులో ఎలాంటి మార్పు లేదు. ఈ టోర్నీలో ఇప్పటివరకు బెంగళూరు జట్టు 8 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచ్ లలో నెగ్గగా, రాజస్థాన్ జట్టు 8 మ్యాచ్ లు ఆడి 5 ఓటములు చవిచూసింది. ఈ నేపథ్యంలో కోహ్లీ సేనదే పైచేయిగా కనిపిస్తోంది.