Donald Trump: ఓ అధ్వానపు అభ్యర్థిపై పోటీ చేయాల్సి వస్తోంది: బైడెన్ ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యలు

  • నవంబరు 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు
  • జోరుగా ప్రచారం చేస్తున్న ట్రంప్, బైడెన్
  • బైడెన్ చేతిలో ఓడితే దేశం విడిచి వెళ్లిపోతానన్న ట్రంప్
Donald Trump described his rival Joe Biden as a disaster

అధ్యక్ష ఎన్నికలకు అగ్రరాజ్యం అమెరికా సన్నద్ధమవుతోంది. నవంబరు 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ), జో బైడెన్ (డెమొక్రాట్) అమీతుమీకి సిద్ధమవుతున్నారు. ఇరువురూ ప్రచారంలో తలమునకలయ్యారు. ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, జో బైడెన్ వంటి అధ్వానపు ప్రత్యర్థిపై పోటీ చేయాల్సి వస్తోందని అన్నారు.

అతనొక అవినీతి పరుడు అని విమర్శించారు. రాజకీయ చరిత్రలోనే ఏమాత్రం పటిమ లేని, సత్తా లేని అభ్యర్థిపై పోటీ చేస్తున్నానని, ఒకవేళ ఓడిపోతే దేశం విడిచివెళ్లిపోతానని వ్యాఖ్యానించారు. "నేను ఓడిపోతే ఏంచేయాలి? జీవితమంతా ఎలా గడపాలి?... నా పరిస్థితి ఓసారి ఊహించుకోండి. బైడెన్ వంటి నాసిరకం ప్రత్యర్థి చేతిలో ఓడితే దేశం విడిచి వెళ్లిపోవడం మినహా మరో మార్గంలేదు. ఇది జోక్ కాదు" అని పేర్కొన్నారు.

అంతేకాదు, మీడియాలోని ఓ వర్గంతో పాటు దిగ్గజ టెక్ కంపెనీలు కూడా బైడెన్ కు మద్దతుగా రంగంలోకి దిగాయని ఆరోపించారు. కాగా, ఈ ఎన్నికల్లో తనకు ఎదురుగాలి తప్పదని భావించే ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News