ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ లకు నోటీసులు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం

17-10-2020 Sat 14:30
Centre issues notices to Amazon and Flipkart
  • పండుగల సీజన్ సమయంలో షాకిచ్చిన కేంద్రం
  • వస్తువు ఏ దేశంలో తయారైందనే విషయాన్ని తెలపకపోవడంపై అసహనం
  • వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ

పండుగల సీజన్ సమయంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీలు గ్రేట్ ఇండియన్ సేల్స్, బిగ్ బిలియన్ డేస్ పేర్లతో ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వీటి పనితీరుపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. వెబ్ సైట్ లో ఒక వస్తువును అమ్ముతున్నప్పుడు... ఆ వస్తువు ఏ దేశంలో తయారైందనే తప్పనిసరి నిబంధనను ఈ రెండు సంస్థలు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఈ రెండు సంస్థలతో పాటు మరికొన్ని ఇతర సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసింది.