హత్యానేరం నుంచి బయటపడేందుకే నాగేంద్ర అలా చెబుతున్నాడు: తేజస్విని తండ్రి జోసెఫ్ ఆరోపణ

17-10-2020 Sat 13:52
tejaswini father about her death
  • మా కూతుర్ని నాగేంద్ర అత్యంత దారుణంగా చంపేశాడు
  • ప్రణాళిక ప్రకారమే స్వల్పంగా గాయాలు చేసుకున్నాడు
  • నాగేంద్రను ఎన్‌కౌంటర్‌ చేయాలి

విజయవాడలో దివ్య తేజస్విని కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆమె తల్లిదండ్రులు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తమ కూతుర్ని నాగేంద్ర అత్యంత దారుణంగా చంపేశాడని ఆరోపించారు. ఆమె శరీరంపై 13 కత్తిపోట్లు ఉన్నాయని, నాగేంద్ర మాత్రం తనకు తానే ప్రణాళిక ప్రకారమే స్వల్పంగా గాయాలు చేసుకున్నాడని తెలిపారు. హత్యానేరం నుంచి బయటపడేందుకే నాగేంద్ర మీడియాతో మాట్లాడుతున్నాడని, తమ కూతురిని చంపిన నాగేంద్రను ఎన్‌కౌంటర్‌ చేయాలని దివ్య తండ్రి జోసెఫ్‌ అన్నారు.

కాగా, దివ్య, నాంగేంద్ర రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. మంగళగిరి పానకాలస్వామి ఆలయానికి వారిద్దరు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. అయితే,  అక్కడ వారికి వివాహమైనట్లు ఏ వివరాలు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నాగేంద్ర, దివ్య ఫోన్లలో వాట్సప్‌, ఫేస్‌బుక్‌ మెసేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.