చట్టపరమైర చర్యలు తీసుకుంటా జాగ్రత్త.. నెటిజన్లపై హీరో ఆమిర్ కూతురు హెచ్చరిక

17-10-2020 Sat 13:39
aira warns netizens
  • నాలుగేళ్లుగా డ్రిపెషన్‌లో ఉన్నానని ఇటీవల ఐరా పోస్ట్
  • ఆ పోస్టుపై అభ్యంతరకర రీతిలో నెటిజన్ల కామెంట్లు
  • మండిపడ్డ ఆమిర్ కూతురు

తాను నాలుగేళ్లుగా డ్రిపెషన్‌లో ఉన్నానని, వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నానని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్‌  ఇటీవల వీడియో రూపంలో ఓ పోస్టు చేసిన విషయం తెలిసిందే.  ఏడాది కాలంగా తాను మానసిక ఆరోగ్యం గురించి ఏదైనా చేయాలని అనుకుంటున్నానని,  ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా ఈ పోస్టు చేస్తున్నానని ఆమె ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేసింది. తన పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వివరించింది.

అయితే, ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఐరా ఖాన్ మానసిక ఆరోగ్యం గురించి చాలా మంది సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అంతేగాక, అభ్యంతరకర రీతిలో మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. దీంతో వారిపై ఆమె మండిపడింది. అభ్యంతరకంగా తన పోస్టులకు కామెంట్లు‌ పెడితే వాటిని డిలేట్ చేస్తానని, అదే వ్యక్తి మళ్లీ అలాగే కామెంట్లు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.